కరోనా ఎఫెక్ట్: అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం

ఎవరూ ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేసిన మంత్రి ఈటల రాజేందర్‌

Etela Rajender
Etela Rajender

హైదరాబాద్‌: తెలంగాణలో తొలి కరోనా కేసు నమోదవ్వగానే ప్రభుత్వం అలెర్ట్‌ అయ్యింది. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. కరోనా పట్ల ఎవరూ ఆందోళన చెందవద్దని ఈటల విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉందని మంత్రి అన్నారు. అయితే దుబా§్‌ు నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన నేపథ్యంలో ఈ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కాగా హైదరాబాదులో ఇద్దరు అనుమానితులకు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఒకరు కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్టు తేలింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/