సిలిండర్‌ పేలి 10 గుడిసెలు దగ్థం

fire accident
fire accident

నిజామాబాద్‌: జిల్లాలోని ముప్కాల్‌ శివారు వరద కాలవ వద్ద అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్‌ సిలిండర్‌ పేలి కూలీలకు చెందిన 10 పూరి గుడిసెలు దగ్ధమయ్యాయి. ఎస్‌ఆర్‌ఎస్పీ పనుల వద్ద కూలీలు నివాసముంటున్న గుడిసెల్లో అగ్నిప్రమాదం సంభవించినట్లు స్థానికులు తెలిపారు. కూలీలకు చెందిన 3 బైకులు, వస్తువులన్నీ పూర్తిగా కాలిపోతాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. కూలీలంతా కట్టుబట్టలతో బయటపడ్డారు.

తాజా తెలంగాణ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/telangana-election-news-2019/