మైలార్‌దేవ్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం

Fire accident
Fire accident

మైలార్‌దేవ్‌పల్లి: రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతం దానమ్మ దోపిడి ప్రాంతంలో ప్లాస్టిక్ స్క్రాప్ కంపెనీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రాజేంద్రనగర్ అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్‌తోనే ఈ ప్రమాదం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ గోదాముకు ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఇలాంటి గోదాములు మైలార్‌దేవ్‌పల్లి చాలా ఉన్నాయని స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. నివాస ప్రాంతాల నుంచి గోదాములను తరలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/