కూకట్‌పల్లి ఐడిఏలో అగ్నిప్రమాదం.. ఒకరి మృతి

Fire accident
Fire accident

హైదరాబాద్‌: హైదరాబాద్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. కూకట్ పల్లిలో ఉన్న ఇండియన్ డిటొనేటర్స్ లిమిటెడ్ (ఐడీఎల్) కంపెనీలో భారీ విస్ఫోటనం సంభవించింది. తయారైన డిటొనేటర్లను పరీక్షిస్తుండగా, ఓ డిటొనేటర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. ఈ ఘటనలో వాసుదేవ శర్మ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. వాసుదేవ శర్మ ఉప్పల్ కు చెందిన వ్యక్తి. కాగా, రాజు, పద్మారావు అనే వ్యక్తులు తీవ్రంగా గాయపడగా వారిని సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించారు. కాగా, ఘటన జరిగిన సమయంలో కంపెనీలో వందల సంఖ్యలో కార్మికులు విధుల్లో ఉన్నారు. పేలుడుతో కూకట్ పల్లి పరిసరాలు దద్దరిల్లిపోయాయి. ఘటనా స్థలికి చేరుకున్న సహాయక బృందాలు చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/