కెటిఆర్‌ పై ఆర్థిక శాఖ మంత్రి ప్రశంసలు

harish rao
harish rao

హైదరాబాద్‌: ఐటీసీ కాకతీయ హోటల్‌లో సీఐఐ ఆధ్వర్యంలో సీ.ఎఫ్‌.వో కాంక్లెవ్‌-2019 సమావేశానికి తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ..పెట్టుబడులు ఆకర్షించేందుకు తెలంగాణ మంత్రి కెటిఆర్‌ కృషి చేసి మంచి ఫలితాలు సాధిస్తున్నారని ప్రశంశలు కురిపించారు. తెలంగాణ ప్రభుత్వం ఐదేళ్లుగా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో అవార్డులు అందుకుంటోందని, తమ సర్కారు పరిశ్రమల స్థాపనకు అండగా ఉంటుందని చెప్పారు. కంపెనీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడేందుకు సీఎఫ్‌వోలు, పారిశ్రామికవేత్తలు సూచనలివ్వాలని హరీష్‌ రావు తెలపారు. కంపెనీ ఆర్థిక పరిస్థితి చీఫ్‌ ఆఫీసర్లకే బాగా తెలుస్తుందని, కంపెనీలో వారే కీలకమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో తన బాధ్యత కూడా సీఎఫ్‌ వోల లాంటిదేనని చెప్పారు. సీఎఫ్‌వోలు కంపెనీ బాగు కోసమే నిరంతరం ఆలోచించాలని ఆయన సూచించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/