కూతురికి అన్యాయం జరిగిందని తండ్రి ఆత్మహత్య

A Fother commit to sucide

A Father commit to sucide

మహబూబాబాద్‌: కూతురికి అన్యాయం జరిగిందని మనస్తాపానికి గురైన ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్‌లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం తానంచెర్లలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితుడి కుమార్తెను ఓ యువకుడు ప్రేమ పేరుతో నమ్మించి వంచన చేశాడు. ప్రేమ నెపంతో ఆమెను నమ్మించి లోబరచుకుని, గర్భవతిని కూడా చేశాడు. ఆ యువతి తాను గర్భవతినని చెప్పి తనను వివాహం చేసుకోవాలని కోరగా అతడు నిరాకరించడంతో, ఆమె తన తండ్రికి జరిగిన విషయాన్ని తెలిపింది. అతడు ఊరి గ్రామ పెద్దలను ఆశ్రయించగా న్యాయం చేస్తామని చెప్పిన పెద్దలు మొహం చాటేయడంతో అతను గ్రామ శివారులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుక్ను పోలీసులు కేసు నమోదు చేసుకుని, విచారణ చేపట్టారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/