రైతు దయాగుణం….

విరాళం ప్రకటించిన రైతు…ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన కవిత

kalvakuntla kavitha
kalvakuntla kavitha

ఆదిలాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి నాయకురాలు కల్వకుంట్ల కవిత ట్విటర్‌లో ఓ వార్తను పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కొనసాగుతుండడంతో కొంత మంది పేదలు తిండి లేకుండా భాధ పడుతున్నారని తెలుసుకున్న ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన రైతు మోర హన్మాండ్లు సాయం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. గత కొన్ని రోజులుగా పేపర్లలో కరోనా వైరస్‌ గురించి తెలుసుకుంటున్నాను. ప్రభుత్వం ఈ వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా లాక్‌డౌన్‌కు పిలుపునిచ్చింది. నాకున్న నాలుగెకరాల పొలంలో ఈ ఏడాది పంట కూడా బాగానే పండింది. ఇటీవలే పంట డబ్బులు వచ్చాయి. రాష్ట్రం లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదలకు తినడానికి తిండి దొరకడం లేదనే విషయం తెలిసింది. నా కుమారులు వారి సహయం కోసం ఎంతో కొంత ఇద్దామని సూచించారు. దీంతోరూ.50వేలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. అని మోర హన్మాండ్లు తెలిపారు. ఈ విషయాన్నే కవిత ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/