గవర్నర్‌ నరసింహన్‌కు వీడ్కోలు

governor-narasimhan- cm kcr
governor-narasimhan- cm kcr

హైదరాబాద్‌: ప్రగతి భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌కు రాష్ట్ర ప్రభుత్వం వీడ్కోలు సభ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ప్రగతి భవన్‌కు చేరుకున్న నరసింహన్‌ దంపతులకు సిఎం కెసిఆర్‌, మంత్రులు ఘన స్వాగతం పలికారు. శాసనసభాపతి, ఉపసభాపతి, మండలి ఉపాధ్యక్షుడు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, సీనియర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఇతర అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్‌ దంపతులను కెసిఆర్‌ దంపతులు ఘనంగా సన్మానించారు. కాగా ఈ కార్యక్రమం అనంతరం నరసింహన్‌ దంపతులు సాయంత్రం చెన్నై వెళ్లనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి గవర్నర్‌.. చెన్నై బయల్దేరనున్నారు. చివరిసారిగా బేగంపేట ఎయిర్‌పోర్టులో సిఎం కెసిఆర్‌ నరసింహన్‌కు వీడ్కోలు పలకనున్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/