వరంగల్‌ గొర్రెకుంట బావిలో మృతదేహాలు

family-commits-suicide warangal gorrekunta

వరంగల్‌: జిల్లాలోని గీసుకొండ మండలం గొర్రెకుంటలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గొర్రెకుంటలోని బావిలో నలుగురి మృతదేహాలు లభ్యమైన విషయం తెలిసిందే. అయితే ఈరోజు మరో రెండు మృతదేహాలను అధికారులు వెలికితీశారు. కాగా పొట్ట చేతపట్టుకుని రాష్ట్రం వచ్చిన వలస కూలీలు బావిలో శవాలై తేలడం గురువారం కలకలం రేపింది. పశ్చిమ బెంగాల్‌ ప్రాంతానికి చెందిన మక్సూద్‌ (50), అతని భార్య నిషా(45), 22ఏళ్ల కుమార్తె(పేరు తెలియాల్సి ఉంది), ఆమె మూడేళ్ల కుమారుడు(పేరు తెలియాల్సి ఉంది) మృతదేహాలు బావిలో తేలియాడడంతో హృదయాల్ని కలిచి వేసింది. వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంట ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందడంతో వీరు ఆత్మహత్యకు పాల్పడ్డారా.. ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్నది తెలియరావడం లేదు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/