నరహంతక వంతెనగా బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌

సిపిఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు

Narayana
Narayana

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌ నుంచి ఓ కారు కింద పడి ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కాగా ఈ నేపథ్యంలో ఫ్లైఓవర్‌పై దుమారం రేగింది. ప్రమాదకరంగా నిర్మించారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఘటనలు పునరావృతం కాకుంగా ఉండేందుకు నిపుణుల కమిటీ వేసింది. కాగ బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై సిపిఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌ను కూల్చివేసి మలుపులు లేకుండా తిరిగి పునర్నిర్మాణం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా నరహంతకు వంతెనగా మారిన బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌ ను పునర్నిర్మించకుంటే భవిష్యత్తులో మరిన్ని ఘోర ప్రమాదాలకు కారణం అవుతుందని ఆయన అన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/