ఒక్కరి పరిస్థితి కూడా విషమంగా లేదు.. ఈటల

వైరస్‌ విదేశాల నుండి వచ్చిన వారి వల్లే వచ్చింది.

eetela rajendar
eetela rajendar

హైదరాబాద్‌: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజెందర్‌ హైదరాబాద్‌ కోఠిలొని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, ప్రైవేటు కాలేజీల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో కరోనా వ్యాప్తి లేదని, విదేశాల నుంచి వచ్చిన వారి నుంచే ఈ వ్యాధి వచ్చిందని అన్నారు, రాష్ట్రంలో వైరస్‌ విస్తరించకుండా అందరూ తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇప్పటి వరకు వైరస్‌ సోకిన వారు ఎవరూ కూడా విషమ పరిస్థితుల్లో లేరని అన్నారు. ఇప్పటివరకు చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రులను వాడుకున్నామని, అవసరమయితే ప్రైవేటు వైద్య కళాశాలలను కూడా వాడుకుంటామని మంత్రి అన్నారు. ప్రస్తుతం కరోనా బాధితుల కోసం 10వేల పడకలు సిద్దంగా ఉన్నాయని అన్నారు. వైరస్‌ నివారణలో ప్రభుత్వానికి ప్రజలు కూడా సహకరించాలని, ఎవరూ కూడా ఇళ్లనుంచి బయటకు రావద్దని సూచించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/