భూమిని కాపాడుకొవడానికి అందరూ కృషి చేయాలి

niranjan reddy
niranjan reddy

సుర్యాపేట: భూసంరక్షణకు ప్రతి ఒక్కరూ అంకితమై పనిచేయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి పిలుపు నిచ్చారు. గురువారం జిల్లాలోని గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రపంచ బాలల దినోత్సవం సందర్భంగా విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ..భూమి తప్ప మానవులు నివసించగలిగేందుకు ఏ గ్రహం అనుకూలంగా లేదన్నారు. మానవుడితో సృష్టిలోని జీవులన్నింటి మనుగడకు అనుకూలంగా ఉన్నది భూగ్రహమేనని ఆయన అన్నారు. భూమిని కాపాడుకునే విషయంలో రాబోయే తరాలకు అవగాహన కల్పించాలన్నారు. మనిషికి ఆహారం కావాలంటే వ్యవసాయం జరగాలి కాబట్టి భూమిని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రైతులు కేవలం సాగుమీదనే దృష్టిపెట్టకుండా ఇతర పంటల మీద కూడా దృష్టిపెట్టాలని సూచించారు. సమీప పట్టణాల అవసరాలను గుర్తించి రైతులు పంటలను ఎంచుకొవాలన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/