ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకోవాలి

Vice-President M Venkaiah Naidu
Vice-President M Venkaiah Naidu

హైదరాబాద్‌: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈరోజు హైదరాబాద్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన బేగంపేటలోని అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్‌ఫోరేషన్ అండ్ రీసర్స్ సెంటర్‌లో జరిగిన శాస్త్రవేత్తలతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. పరిశోధనలో 70యేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శాస్త్రవేత్తలతో సమావేశం నిర్వహించారు. ఈనేపథ్యంలో ఆయన మాట్లాడుతు విజ్ఞానం అనేది ఎవరి సొంతం కాదు. ప్రతి ఒక్కరూ విద్యార్థులే. సమస్యలు ఎలా పరిష్కరించాలన్న అంశంపై నిరంతరం కృషి అవసరమని తెలిపారు.చాలా విశ్వవిద్యాలయాలకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడా. అరుణాచల్‌ప్రదేశ్, జమ్ముకశ్మీర్ వంటి చోట్ల పరిశోధన కేంద్రాలకు వెళ్లా. వ్యవసాయంలో సవాళ్లను అధిగమించేలా ఇంకా పరిశోధనలు జరగాలి. ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.


మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/