త్వరలో ఉస్మానియాలో మళ్లీ ఈవినింగ్‌ క్లినిక్‌

osmania hospital
osmania hospital


హైదరాబాద్‌: ఉస్మానియా ఆసుపత్రిలో నిత్యం రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మెరుగైన వైద్య సేవలు అందించేక్రమంలో ఉద్యోగులతో పాటు ఆసుపత్రికి వచ్చే రోగులకు అందుబాటులో ఉండే విధంగా ఈవినింగ్‌ క్లినిక్‌ను ఏర్పాటు చేయనున్నారు. త్వరలోనే ఆసుపత్రి యాజమాన్యం దీనికి శ్రీకారం చుట్టనుంది. గతంలో ఆసుపత్రిలో ఉద్యోగులకు వైద్య సేవలు అందించేందుకు ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీం పేరుతో ఇహెచ్‌ఎస్‌ క్లినిక్‌ను ఏర్పాటు చేసారు. కొన్ని కారణాల వల్ల ఈ క్లినిక్‌ నిలిచిపోవడంతో తిరిగి ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఉస్మానియాలో మళ్లీ ఈవినింగ్‌ క్లినిక్‌ను ఓపి బ్లాక్‌లో ఏర్పాటు చేయాలని, మధ్యాహ్నం రెండు నుండి నాలుగు గంటల వ్యవధిలో పలు విభాగాలకు చెందిన వైద్యులు వైద్య సేవలు అందిస్తారని యాజమాన్యం పేర్కొంది. త్వరలోనే ఏర్పాటు చేయనున్న ఈ క్లినిక్‌లో మెడిసిన్‌, సర్జరీ, ఆర్థోపెడిక్‌ విభాగాలకు చెందిన వైద్యులు అందుబాటులో ఉంటారని డాక్టర్‌ నాగేందర్‌ తెలిపారు.

తాజా క్రీడా వార్త‌ల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/sports/