కరోనాపై దుష్ప్రచారం చేస్తే కేసులు తప్పవు

కరోనా పై అసత్య ప్రచారం చేయొద్దంటూ మంత్రి ఈటెల రాజేందర్ విజ్ఞప్తి

etela rajender
etela rajender

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) వ్యాప్తిని కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకుంటోంది. నేపథ్యంలోనే ఇప్పటికే విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు, మాల్స్ బంద్ అయ్యాయి. అయితే, తెలంగాణలో కరోనాపై దుష్ప్రచారం జరుగుతోందని, ఈ నేపథ్యంలో కరోనా పాజిటివ్ అంటూ ఎవరైనా సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం చేస్తే వారిపై కేసులు పెట్టాలని ఆదేశాలు జారీ చేశామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు. దయచేసి ఎవరూ తప్పుడు వార్తలు సర్క్యులేట్ చేయవద్దని స్పష్టం చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/