వైద్యలకు పిపిఈ కిట్లు పంపిణి చేసిన ఎర్రబెల్లి

సీయనియంత్రణే కరోనాను దూరం చేస్తుంది

errabelli dayakar rao
errabelli dayakar rao

మహబూబాబాద్‌: కరోనాను ఎదుర్కోవడానికి స్వియ నియంత్రణ తప్ప మరే మార్గము లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులకు పిపిఈ కిట్లు, జర్నలిస్టులకు శానిటైజర్‌లు అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతు..కరోనా ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరు సామాజిక దూరం తప్పని సరిగా పాటిచాలన్నారు. స్వీయ నియంత్రణలో ఉండాలన్నారు. వైద్యులపై దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా ఆసుపత్రిని అన్ని విధాల అభివృద్ది చేస్తామని అన్నారు. వైద్యులకు పిపిఈ కిట్లు ఇచ్చిన గాయత్రి రవి చంద్రకు మంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/