నెల ఉద్యోగం లేకపోతే

EPFO
EPFO

నెల ఉద్యోగం లేకపోతే
పిఎఫ్‌ నుంచి 75 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం ఇపిఎఫ్‌ ఉద్యోగులకు సానుకూలమైన నిర్ణయం తీసుకుంది. ఇపిఎఫ్‌ సభ్యుడు నెల రోజులపాటు జాబ్‌ చేయకుండా ఉంటే తన పిఎఫ్‌ సొమ్ములో 75 శాతం విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించారు. ఈ విషయాన్ని కార్మికశాఖ మంత్రి సంతోష గాంగ్వార్‌ సోమవారం లోక్‌సభలో వెల్లడించారు. జూన్‌ 26న జరిగిన సమావేశంలో ఈపిఎఫ్‌ స్కీము 1952లో కొత్తగా 68 హెచ్‌హెచ్‌ పారాగ్రాఫ్‌ను చేర్చాలని ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌(ఇపిఎఫ్‌)కు చెందిన సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ట్రస్టీస్‌ అంగీకరించిందని ఆయన చెప్పారు. ఈ కొత్త పారాగ్రాఫ్‌కు చెందిన సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ట్రస్టీస్‌ అంగీకరించిందని ఆయన చెప్పారు.

ఈ కొత్త పారాగ్రాఫ్‌ ప్రకారం ఓ ఇపిఎఫ్‌ మెంబరు నెల రోజులపాటు ఎలాంటి ఉద్యోగం లేకుండా ఉంటే తన మొత్తం సొమ్ములో 75 శాతం విత్‌డ్రా చేసుకునే వీలుంటుంది. లోక్‌సభలో ప్రశ్నోత్తరాలు సమయంలో సంతోష్‌గాంగ్వార్‌ తెలిపారు. రెండు పాటు ఉద్యోగం లేకుండా ఉంటే వంద శాతం పిఎఫ్‌ తీసుకునే అవకాశాన్ని ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్స్‌ స్కీమ్‌ కల్పిస్తున్నది. అయితే పెళ్లికోసం ఉద్యోగం మానేసిన మహిళా ఉద్యోగుల విషయంలో ఈ రెండు నెలల నిబంధన ఉండదు.

=====