చెదలు పట్టిన బ్యాలెట్‌ పత్రాలు, కౌంటింగ్‌ నిలిపివేత

ballot papers
ballot papers

భూపాలపల్లి: రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిటిసి, జడ్పీటిసి ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభమైంది. ఐతే భూపాలపల్లిలో చెదలు పట్టి ఎంపిటిసి బ్యాలెట్‌ పత్రాలు పూర్తిగా దెబ్బతినడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. సూరారం, అంబటిపల్లి గ్రామాలకు చెందిన ఎంపిటిసి బ్యాలెట్‌ పత్రాలు చెదలుపట్టాయి. దీంతో కౌంటింగ్‌ సిబ్బంది. గందరగోళంలో పడిపోయింది. ప్రత్యామ్నాయంపై ఎన్నికల సంఘంతో రిటర్నింగ్‌ అధికారులు మాట్లాడుతున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/