నాగార్జునసాగర్ ప్రాజెక్టు 8 గేట్లు ఎత్తివేత

Nagarjuna Sagar Dam

నల్గొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరింది. దీంతో అధికారులు 8 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ ఏడాది రెండు నెలల్లో మూడోసారి నీటిని వదిలారు. శ్రీశైలం నుంచి 1,55,291 క్యూసెక్కుల నీరు నాగార్జునసాగర్‌కు చేరుతోంది. సాగర్ నుంచి కూడా 1,55,291 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0405 టీఎంసీలుండగా.. ప్రస్తుతం 309.6546 టీఎంసీలుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 589.20 అడుగులు ఉంది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/