ఆధునిక టెక్నాలజీతో దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి

durgam cheruvu cable bridge under construction
durgam cheruvu cable bridge under construction

హైదరాబాద్‌: అక్టోబరు నెలలోగా దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయనున్నట్లు టిహెచ్‌ఎంసి కమీషనర్‌ దానకిషోర్‌ తెలిపారు. ఈ రోజు ఆయన మున్సిపల్‌ శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌ నిర్మాణరంగ అధికారులతో కలిసి నేడు పరిశీలించారు. ఈ సందర్భంగా దానకిషోర్‌ మాట్లాడుతూ..ఈ ఏడాది అక్టోబరులోగా దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తున్నామన్నారు. సిమెంటు కాంక్రీటు ఆధునిక టెక్నాలజీతో ఈ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుందన్నారు. వాకింగ్‌ ట్రాక్‌, సైక్లింగ్‌ ట్రాక్‌తో పాటు అత్యాధునిక ఆకర్షణీయమైన లైటింగ్‌ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బ్రిడ్జికి ఇరువైపులా స్టీల్‌ రెయిలింగ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

తాజా హీరోల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actors/