వైద్యులకు పిపిఈ కిట్‌లు, మాస్క్‌లు ఇవ్వాలి

ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు

telangana high court
telangana high court

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా భాధితులకు చికిత్స చేసే వైద్యులకు పిపిఈ కిట్స్‌, మాస్క్‌లు అందించాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టులో కరోనా నివారణ చర్యలపై విచారణ జరిగింది. ఈ సందర్బంగా కరోనాపై పలు సూచనలు, ఆదేశాలను ప్రభుత్వానికి జారీ చేసింది. జన సంచారం తక్కువ ఉండేందుకు ప్రతి కాలనిలో మొబైల్‌ రైతు బజార్లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి జిల్లాలో కరోనా కోసం ప్రత్యేక కాల్‌ సెంటర్‌లు ఏర్పాటు చేయాలని పిటీషనర్‌ కోరారు. దీనికి స్పందించిన ప్రభుత్వ తరపు న్యాయవాది కరోనా నివారణకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 329 కంటైన్‌మెంట్‌ ప్రాంతాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కరోనా బాధితులకు వైద్యం చేస్తున్న డాక్టర్‌లకు అన్ని వసతులు కల్పించాలంది. ప్రభుత్వం తీసుకున్న చర్యలను మరోసారి తెలియజేయాలని సూచించింది. తదుపరి వాచారణను మే 8 కి వాయిదా వేసింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/