రైతుల ప్రాణాలను గాలికి వదిలేయకండి

revanth reddy
revanth reddy

హైదరాబాద్‌: తెలంగాణలో వేల మంది రైతులు పిట్టల్లా నేల రాలుతున్నా, కనికరం లేని కసాయి ముఖ్యమంత్రి కెసిఆర్‌ గారూ.. రైతుల ప్రాణాలను గాలికి వదిలేయకండని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి ట్టిట్టర్‌ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి నిన్న సీఎం కెసిఆర్‌కు రాసిన లేఖలోని అంశాలను గురించి ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ఆయన పోస్టు చేశారు. రైతుల సమస్యలపై కెసిఆర్‌ ఎందుకు స్పందించడం లేదని లేఖలో రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. కలెక్టర్ల సమావేశంలో 12 గంటల ఉపన్యాసం ఇచ్చిన ముఖ్యమంత్రి ఐదు నిమిషాలైనా రైతుల సమస్యలపై చర్చింలేదని దుయ్యబట్టారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/