ఆ మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో జూన్‌ 3 వరకు నోటిఫికేషన్‌ ఇవ్వొద్దు

కేంద్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశం

telangana high court
telangana high court

హైదరాబాద్‌: అనర్హత వేటుతో ఖాళీ ఐన మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో జూన్‌ 3 వరకు ఎన్నికల నోటిఫికేషన్‌ ఇవ్వొద్దని కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. రాములునాయక్‌, యాదవరెడ్డి, భూపతిరెడ్డిల మండలి సభ్యత్వం రద్దు వ్యవహారంపై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఈ ముగ్గురూ కాంగ్రెస్‌లో చేరినట్లు ఆధారాలు, ఇతర రికార్డులు సమర్పించి..వాదనలు వినిపించేందుకు గడువు ఇవ్వాలని అదనపు అడ్వకేట్‌ జనరల్‌ రామచంద్రరావు న్యాయస్థానాన్ని కోరారు. వేసవి సెలవుల ప్రత్యేక ధర్మాసనం విచారణను జూన్‌ 6కు వాయిదా వేసింది. ఐతే జూన్‌ 3 వరకు ఆ మూడు స్థానాల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ ఇవ్వొద్దని మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.

తాజా హీరోల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actors/