సిఎం కెసిఆర్‌కు ఎంకే స్టాలిన్‌ లేఖ

రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడుతున్నారని పొగడ్తలు

dmk-chief-mk-stalin-cm-kcr

చెన్నై: కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ పరిహారం విషయంలో తెలంగాణ వైఖరిని అభినందిస్తూ, తెలంగాణ సిఎం కెసిఆర్‌కు డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ లేఖ రాశారు. తెలంగాణ సీఎంతో పాటు పంజాబ్, కేరళ, ఢిల్లీ, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి ముఖ్యమంత్రులకు కూడా ఆయన లేఖ రాశారు. జీఎస్టీ పరిహారం విషయంలో ఈ రాష్ట్రాలు, తమ ప్రజల ప్రయోజనాలను పరిరక్షించేందుకు కట్టుబడి వున్నాయని పొగడ్తలు కురిపించారు. కేంద్రం ఇచ్చిన ఆప్షన్స్ కు ఈ రాష్ట్రాలు వ్యతిరేకంగా నిలడవం అభినందించదగ్గ విషయమని అన్నారు. జీఎస్టీ విషయంలో కేంద్రం, పలు రాష్ట్రాల ప్రయోజనాలను వమ్ము చేస్తోందని, కేంద్రం నిర్ణయాలను అడ్డుకుంటున్నందుకు తమిళనాడు ప్రజలంతా తెలంగాణ, ఢిల్లీ తదితర రాష్ట్రాల ప్రభుత్వాలను అభినందిస్తున్నారని అన్నారు. వివిధ రాష్ట్రాలకు కేంద్రం నుంచి రూ. 47,272 కోట్ల జీఎస్టీ పరిహారం రావాల్సి వుందని కాగ్ వెల్లడించిన రిపోర్టును ప్రస్తావించిన ఆయన, ఈ నిధులను వెంటనే చెల్లించేలా కేంద్రంపై ఒత్తిడిని పెంచాలని సలహా ఇచ్చారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/