పోస్టుమార్టం తర్వాత నిర్ధారిస్తాం: డీసీపీ

DCP Srinivas
DCP Srinivas

Hyderabad: ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ది ఆత్మహత్య? కాదా? అనేది పోస్టుమార్టం తర్వాత నిర్ధారిస్తామని డీసీపీ శ్రీనివాస్‌ తెలిపారు. కోడెల ఉరివేసుకున్నారని, ఆస్పత్రికి తీసుకొచ్చేటప్పటికే చనిపోయారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపినట్లు డీసీపీ తెలిపారు. ఉదయం 11 గంటలకు తన పడక గదిలో పడి ఉన్నారని, భార్య, కుమార్తె, పనిమనిషి ఆస్పత్రికి తీసుకొచ్చారని చెప్పారు. అప్పటికే కోడెల చనిపోయినట్లు వైద్యులు నిర్ధరించారని డీసీపీ తెలిపారు. రాత్రి ఇంట్లో ఎలాంటి గొడవ జరగలేదని పేర్కొన్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించనున్నారని పేర్కొన్నారు.