ధర్నా చేస్తున్న దత్తత్రేయ అరెస్టు

Bandaru Dattatreya
Bandaru Dattatreya

హైదరాబాద్‌: ఇంటర్‌ విద్యార్థులకు న్యాయం కోసం తెలంగాణ బిజెపి అధ్యక్షుడు సోమవారం నిరవధిక నిరాహార దీక్ష చేపట్టి అరెస్టు అయ్యరు. ఆయన అరెస్టుకు నిరసనగా ఆపార్టీ నేతలు ట్యాంక్‌బండ్‌ సమీపంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఈరోజు నిరసన చేపట్టారు. దీంతో ఆందోళన చేస్తున్న మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతోపాటు పార్టీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించేందుకు అనుమతులు లేవని, ఇక్కడ ఆందోళనలు చేయవద్దని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని, ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలియజేయడం ప్రతి పౌరుడి హక్కు అని అన్నారు. ఎన్ని అరెస్టులు చేసినా ఇంటర్ విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు తమ పోరాటం కొనసాగిస్తామని చెప్పారు.


మరిని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/