ఆ సచివాలయం ముఖాన్నే చూడను!

CS Joshi
CS Joshi

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతమున్న సచివాలయాన్ని కూల్చి కొత్త సచివాలయాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం తలచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుత సచివాలయాన్ని ఇతర భవనాల్లోకి తరలిస్తున్నారు. సచివాలయం తరలింపు విషయంపై సిఎం కెసిఆర్‌ ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా అధికారులందరి ముందే సీఎస్ జోషిపై
సిఎం కెసిఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జోషి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారట. అందరి ముందు సీఎం తనను తిట్టారని మనస్తాపం చెందారట. ఈ నేపథ్యంలోనే పాత సెక్రటేరియట్ ముఖం కూడా చూడబోనని సీఎస్ జోషి.. సహచర ఉద్యోగులతో తెగేసి చెప్పారట. ఇకపై బూర్గుల రామకృష్ణారావు భవనానికే వస్తానని.. అక్కడ వసతి లేకపోతే ఇంటినుంచే కార్యకలాపాలు నిర్వహిస్తానని సీఎస్ స్పష్టం చేశారట.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/