గణేష్ నిమజ్జనానికి గట్టి బందోబస్తు

hyderabad-cp-anjani-kumar
hyderabad-cp-anjani-kumar

హైదరాబాద్‌ : గణేష్‌ నిమజ్జనం కోసం గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. ప్యాట్నీలోని మహబూబ్ కళాశాలలో గురువారం ఆయన పోలీసు సిబ్బందితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నిమజ్జనం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు 21 కిలోమీటర్ల మేర నిమజ్జనం ర్యాలీ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. నిమజ్జనం జరిగే సమయంలో ప్రతి పోలీసు అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా అన్ని చర్యలు తీసుకున్నట్టు సిపి వెల్లడించారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/