కరోనా అలర్ట్‌: పోస్టర్‌ విడుదల చేసిన కెటిఆర్‌

covid-19-telangana-government-releases-wall-poster-aware-people
covid-19-telangana-government-releases-wall-poster-aware-people

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో సమావేశమైన మంత్రి వర్గ ఉపసంఘం. ఈ సమావేశానికి మంత్రులు శ్రీ ఈటల రాజేందర్‌, శ్రీ కెటిఆర్‌, శ్రీ ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై పురపాలక, పంచాయతీరాజ్‌, వైద్య శాఖ అధికారులతో కలిసి మంత్రులు సమీక్షించారు. ప్రజల్లో అవగాహన పెంచడం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. ఈ సందర్భంగా కెటిఆర్‌ మాట్లాడుతూ..హైదరాబాద్‌తో పాటు అన్ని మున్సిపాలిటీల్లో తెలుగు, ఇంగ్లీష్‌, ఉర్దూ భాషల్లో హోర్డింగ్‌లు, వాల్‌ పోస్టర్‌లతో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తామని అన్నారు. దానిలో భాగంగా ప్రజారోగ్య కుటుంబ సంక్షేమశాఖ..ముందు జాగ్రత్తలు పాటిద్దాం, కరోనా వైరస్‌ కారణంగా వైరస్‌ సంక్రమణ ఆరికడదం అని ఓ పోస్టర్‌ విడుదల చేసింది. వ్యాధి నిర్ధారణ పరీక్ష కేంద్రాల సమాచారం కోసం హెల్స్‌లైన్‌ 040-2465119 నెంబర్‌ను సంప్రదించాలని సూచించింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/