రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి

road accident
road accident

రంగారెడ్డి : ఇబ్రహీంపట్నం పరిధి సీతారాంగేట్ వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇబ్రహీంపట్నం ఎంఇఒ కారు అదుపుతప్పి బైక్‌పై వెళ్తున్న దంపతులను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని నిమిత్తం హైదరాబాద్‌లోని జీవన్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ దంపతులు మృతి చెందారు. మృతులను మంచాల మండలం ఆరుట్లకు చెందిన అంజయ్య, గడ్డమ్మ గా గుర్తించారు. శవపరీక్ష కోసం అంజయ్య, గడ్డమ్మ మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/