విద్యుద్ఘాతంతో దంపతుల మృతి

 Dead
Dead

Warangal: విద్యుద్ఘాతంతో దంపతులు మృతిచెందిన ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ధర్మసాగర్‌ మండలం కాశగూడెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హైదర్‌ (40), గోరిబీ (38) దంపతులు కాశగూడెంలో నివాసముంటున్నారు. గోరిబీ బట్టలు ఆరేస్తుండగా ఆమెకు కరెంటు షాక్ తగిలింది. ఆమెను రక్షించేందుకు హైదర్ యత్నించి అతడు కూడా కరెంటు షాక్‌కు గురయ్యాడు. దీంతో దంపతులిద్దరూ మృతి చెందారు.