కరోనా వైరస్‌: హోళీ వేడుకలపై పిటిషన్‌

high court of telangana
high court of telangana

హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌(కోవిడ్‌ 19) వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో హోళీ సంబరాలపై రాష్ట్ర వ్యాప్తంగా నిషేధం విధించాలంటూ.. హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. హైదరాబాద్‌లోని మణికొండకి చెందిన గంపా సిద్దలక్ష్మి ఈ మేరకు బుధవారం హైకోర్టుని ఆశ్రయించారు. ఈ నెల 9 లేదా 10 తేదీల్లో హోళీ సంబరాలు జరుగనున్నాయని ఆమె కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ వేడుకలని నిషేధించాలని రిట్‌ పిటిషన్‌లో కోరారు. వేడుకలని నిషేధించడం ద్వారా ప్రజలని వైరస్‌ బారినపడకుండా కాపాడవచ్చని పేర్కొన్నారు. కోవిడ్‌ వైరస్ విజృంభిస్తున్న‌ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ సైతం హోలీ వేడుకలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నారు. ప్రజలు కూడా వేడుకలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/