ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి కరోనా

కుటుంబీకులు, సిబ్బందికి కూడా పాజిటివ్

MLA Mahipal Reddy
MLA Mahipal Reddy

Hyderabad: పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి కరోనా   సోకింది. ప్రస్తుతం ఆయన నగరంలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఎమ్మెల్యే తల్లి మాణెమ్మ, సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి, డ్రైవర్ కిరణ్, పీఏ వినోద్ లకు కూడా కరోనా సోకింది.

ఎమ్మెల్యేకు తొలుత కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆయన కుటుంబీకులు, సిబ్బంది పరీక్షలు చేయించుకోగా వారికి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది.

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/