కరీంనగర్‌లో కరోనా కలకలం

ఒక్కరోజే 8 పాజిటివ్‌ కేసులు..రంగంలోకి దిగిన 100 ప్రత్యేక వైద్యబృందాలు

కరీంనగర్‌: రాష్ట్రంలో కరోనా వైరస్‌ తీవ్ర కలకలం సృష్టిస్తుంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడం రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. నిన్న ఒక్కరోజే 8మందిలో కరోనా పాజిటివ్‌ అని తేలడం ఇందుకు కారణం. అయితే వీరందరు తెలంగాణ వారు కాదని, ఇండోనేషియా నుంచి వచ్చారని తెలిసింది వారు కరీంనగర్‌లో సంచరించినట్టు చెప్పడంతో పోలీసులు రంగంలోకి దిగారు. వారు ఎకడెక్కడ తిరిగారు, ఎవరిని కలిశారు అని ఆరా తీస్తున్నారు. అయితే కలెక్టరేట్‌ పరిధిలో ఉన్న ప్రార్థనా మందిరాలకు వెళ్ళినట్లు తెలిపారు. అలాగే వీరు సంచరించిన ప్రాంతాలను తెలుసుకునేందుకు పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. దీంతో 100 ప్రత్యేక వైద్య బృందాలు కరీంనగర్‌లో ఇంటింటికీ వెళ్లి పరీక్షలు చేస్తున్నారు. జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమలాకర్‌ జిల్లా అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. అవసరమయితే ఆయా ప్రాంతాలను నిర్బంధంలో ఉంచాలని సూచిస్తూ, ప్రతి ఒక్కరూ స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరూ కూడా సమస్యను నిర్లక్ష్యం చేయకూడదని అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/