ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర : ఎర్రబెల్లి


Hyderabad: తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆర్టీసీ కార్మికులు ప్రతిపక్షాల వలలో పడ్డారన్నారు. కావాలనే కార్మికులను రెచ్చగొడుతున్నారన్నారు. కార్మికులు 25 శాతం ఫిట్‌మెంట్‌ అడిగితే కేసీఆర్‌ 44 శాతం ఇచ్చారని గుర్తు చేశారు. అప్పుడు ఆర్టీసీ కార్మికులంతా హర్షం వ్యక్తం చేశారన్నారు. ఆర్టీసీని బాగు చేయాలనే సీఎం అన్ని విధాలా సహకరించారన్నారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తామని ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తున్నారని కాంగ్రెస్‌, బీజేపీ చిత్రీకరిస్తున్నాయని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం డ్రామాలు ఆడుతున్నాయన్నారు. కార్మికులను ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామనలేదన్నారు.

తాజా ఆధ్యాత్మికం వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/devotional/