కాంగ్రెస్‌ రూ. 50 లక్షలు ఆఫర్‌

rega kanta rao
rega kanta rao, pinapaka mla


హైదరాబాద్‌: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్‌ పార్టీ రూ. 50 లక్షల చొప్పున ఆఫర్‌ చేసిందని పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు స్పష్టం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద అసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రంసక్కుతో కలిసి మీడియాతో మాట్లాడారు. డబ్బులకు అమ్ముడుపోయే వాళ్లమైతే కాంగ్రెస్‌లోనే ఉండేవారమని, ఆదివాసీల అభివృద్ధి కోసమే తాము టిఆర్‌ఎస్‌లో చేరుతున్నామని తేల్చేశారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టిఆర్‌ఎస్‌లో చేరుతామని తాము ఇప్పటికే చెప్పామని అన్నారు. ఉత్తమ్‌, భట్టి విక్రమార్క అబద్దాలు వల్లిస్తూ.. ఎంతకు అమ్ముడుపోయారని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఆదివాసీల ఆత్మగౌరవం దెబ్బతినేలా ఉత్తమ్‌, భట్టి మాట్లాడారని, వారిద్దరూ పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. తనతో పాటు ఆత్రం సక్కు, సండ్ర వెంకటవీరయ్య టిఆర్‌ఎస్‌లో చేరితో కాంగ్రెస్‌ బలం 16కి పడిపోతుందని, ఉన్న 16 మంది ఎమ్మెల్యేలలో నాలుగు గ్రూపులున్నాయని, కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు ఎందుకు ఓడించారో ఇప్పటికైనా కాంగ్రెస్‌ అగ్ర నాయకులకు అర్ధం కావాలని రేగా సూచించారు.