పోలీసులపై ఎస్‌పికి రేవంత్‌ రెడ్డి ఫిర్యాదు

ఎన్నికల సంఘం కమిషనర్‌కు కూడా

Revanth Reddy
Revanth Reddy

హైదరాబాద్‌: తెలంగాణ పోలీసుల తీరుపై కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. కోస్గి పట్టణంలో తమ శిబిరంలో ఉన్న 16వ వార్డు కౌన్సిలర్ ఎల్లమ్మను పోలీసులే బలవంతంగా టిఆర్‌ఎస్‌ క్యాంపునకు తరలించారని ఆరోపించారు. ఈ మేరకు నారాయణపేట జిల్లా ఎస్‌పికి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. పోలీసుల తీరును ఖండిస్తున్నట్టు తెలిపారు. అంతేకాదు పోలీసుల వ్యవహార సరళిపై ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డికి కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/