కాంగ్రెస్‌ ఎంపి రేవంత్‌ రెడ్డి అరెస్ట్‌

Revanth Reddy arrested
Revanth Reddy arrested

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎంపి రేవంత్‌ రెడ్డి అరెస్టయ్యారు. గండిపేట చెరువుకు వెళ్లే దారిలో మంత్రి కెటిఆర్‌ అక్రమంగా ఫామ్‌హౌస్‌ నిర్మించారని ఆరోపిస్తూ.. ఫామ్‌ ముట్టడికి రేవంత్‌ వెళ్లారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు.. మార్గం మధ్యలోని జన్వాడ వద్ద అరెస్ట్‌ చేశారు. ఆయనతో పాటు మాజీ ఎంపి కొండ విశ్వేశ్వర రెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. దీంతో జన్వాడ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. అనంతరం రేవంత్‌ మీడియాతో మాట్లాడుతూ.. 111 జీవోను తుంగలో తొక్కి
కెటిఆర్‌ అక్రమంగా ఫామ్‌ హౌస్‌ నిర్మించారని ఆరోపించారు. 25 ఎకరాల్లో నిబంధనలకు వ్యతిరేకంగా ఫామ్‌ హౌస్‌ నిర్మాణం చేపట్టారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిబంధలన సిఎం కెసిఆర్‌ కెటిఆర్‌ లు అతిక్రమించారని రేవంత్‌ విమర్శించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని విలాసవంతమైన ఫామ్‌ హౌస్‌లో కేసీఆర్‌కేటీఆర్‌ జీవితం గడుపుతున్నారని అన్నారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలను కేటీఆర్‌ పాటించడం లేదని మండిపడ్డారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/