ఇంత ఘోరమైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

రజకార్ల కంటే దారుణంగా పోలీసులు వ్యవహరించారు

Komatireddy Venkat Reddy
Komatireddy Venkat Reddy

హైదరాబాద్‌: గత 25 ఏళ్లలో ఇంత ఘోరమైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. రజకార్ల కంటే దారుణంగా పోలీసులు వ్యవహరించారని విమర్శించారు. గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కోమటిరెడ్డి మాట్లాడారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రకటనకు ముందే జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలను సీఎం కెసిఆర్‌ బ్లాక్‌ మెయిల్‌ చేశారని కోమటి రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌, మంత్రి కెటిఆర్‌లను వదిలిపెట్టమని..గ్రామ గ్రామాన తిరిగి వారిని తీరును ఎండగడతామని అన్నారు. నల్గొండలో టిఆర్‌ఎస్‌-ఎంఐఎం పొత్తు పెట్టుకున్నాయన్నారు. కెసిఆర్‌ చేసిన అక్రమాలు త్వరలోనే బయటకు వస్తుందని వాళ్లు చేసిన అవినీతిపై ఆధారాలను ఈడీ, విజిలెన్స్‌కు అందిస్తానని చెప్పారు. ఈ మున్సిపల్‌ ఎన్నికలు నిజాయితీగా జరగలేదని ఆయన విమర్శించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/