అసెంబ్లీ వద్ద కాంగ్రెస్‌ నాయకుల నిరసన

mallu bhattivikramarka, sridhar babu
mallu bhattivikramarka, sridhar babu


హైదరాబాద్‌: సీఎల్పీని టిఆర్‌ఎస్‌లో విలీనం చేసే ప్రక్రియను నిరసిస్తూ కాంగ్రెస్‌ నేతలు అసెంబ్లీ ఆవరణలో నిరసనకు దిగారు. కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్‌లోని 12 మంది ఎమ్మెల్యేలు సిఎల్పీని టిఆర్‌ఎస్‌ఎల్పీలలో విలీనం చేయాలని కోరుతూ స్పీకర్‌ పరిగె శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. దీన్ని వ్యతిరేకిస్తూ సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు. జగ్గారెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్‌, షబ్బీర్‌ అలీలు మూతికి నల్ల రిబ్బన్‌ కట్టుకుని నిరసనకు దిగారు. తమ పార్టీ నుంచి గెలుపొంది పార్టీని వీడినట్లు ప్రకటించిన ఎమ్మెల్యేలందరిపైనా అనర్హత వేటు వేయాలని నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. గతంలో అనర్హత వేటుపై స్పందించని ప్రభుత్వం ఈ రోజు విలీన ప్రక్రియకు సంబంధించి మాత్రం శరవేగంగా ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/