ఈసీకి కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదు

Congress party
Congress party

న్యూఢిల్లీ: గత నెలలో తెలంగాణలో జరిగిన లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌పై తమకు అనుమానాలు ఉన్నాయంటూ రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీ) ఫిర్యాదు చేశారు. ఎన్నికలు జరిగిన రోజు సాయంత్రం 5గంటల తర్వాత పెరిగిన పోలింగ్‌ శాతంపై తమకు ఉన్న సందేహాలను వెల్లడించారు.ఈ సందర్భంగా ఈరోజు కాంగ్రెస్‌ నేతలు మర్రి శశిధర్‌ రెడ్డి, రేణుకా చౌదరి, నిరంజన్‌ రెడ్డి ఎన్నికల సంఘం అధికారులను కలిశారు. ఈ నేపథ్యంలో మర్రి శశిధర్‌ మీడియాతో మాట్లాడుతు సాయంత్రం 5గంటల తర్వాత పోలింగ్‌ శాతం పెరగడాన్ని ఈసీఐ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. పోలింగ్‌ అనంతరం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తంచేశారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/