రేవంత్‌రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతల అరెస్ట్

ప్రమాద స్థలిని పరిశీలించేందుకు కొల్లాపూర్ వెళ్లిన రేవంత్

revanth-reddy-and-congress-leaders-arrested

కొల్లాపూర్‌: నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో శుక్రవారం ప్రమాదం చోటుచేసుకోవడంతో.. కాంగ్రెస్ నేతలు ఈరోజు ఆ ప్రాజెక్టును సందర్శించేందుకు బయలుదేరారు. ఉప్పునుంతల నుంచి కొల్లాపూర్‌ వరకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు తెలకపల్లి వద్ద అడ్డుకున్నారు. దీంతో తెలకపల్లి వల్ల ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డిని వాహనాన్ని కూడా పోలీసులు అడ్డగించారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కారులో నుంచి దిగకుండా గంటపాటు అలానే ఉన్నారు. దీంతో అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ శ్రేణులు నాగర్‌కర్నూల్ అచ్చంపేట రహదారిపై బైఠాయించారు. రేవంత్ సహా మిగతా నేతలను కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పంప్‌హౌస్ వద్దకు అనుమతించాలని డిమాండ్ చేశారు.

అయితే ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం కలగడంతో పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను చెదరగొట్టారు. ఈ క్రమంలో రేవంత్‌రెడ్డి కారులో నుంచి పోలీసులతో మాట్లాగే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో రేవంత్‌రెడ్డి కాలికి స్వల్ఫ గాయమైంది. దీంతో రేవంత్, మల్లు రవి, సంపత్‌కుమార్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఉప్పునుంత పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను పట్టించుకోకుండా కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి సమీపంలోనే సొరంగ మార్గం పనులు చేపట్టారని పేర్కొన్నారు. కమీషన్‌ కోసమే ఓపెన్‌ కెనాల్‌గా ఉన్న డిజైన్‌ను సొరంగమార్గం కింద మార్చారని ఆరోపించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/