బిజెపితో కాంగ్రెస్‌ కలవడం దారుణం

ఇలాంటి నిర్ణయాలతో ముస్లింలు కాంగ్రెస్‌ పార్టీకి దూరం అవుతారు

V. Hanumantha Rao
V. Hanumantha Rao

హైదరాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో పలుచోట్ల విజయం సాధించేందుకు బిజెపితో కాంగ్రెస్‌ కలవడం దారుణమని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత వి.హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ అవలంబిస్తున్న ఇలాంటి విధానాలతో నిత్యం ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పోరాటం చేసే నాయకుల ఆత్మస్థైర్యం దెబ్బతింటుదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి నిర్ణయాలతో ముస్లింలు కాంగ్రెస్‌ పార్టీకి దూరుం అయ్యే అవకాశాలున్నాయన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తన సిద్ధాంతాలను ఏమైనా మార్చుకుందా? అనే అనుమానం కలుగుతోందని అన్నారు. బిజెపిపై నిత్యం పోరాటం చేయాల్సిన కాంగ్రెస్‌ పార్టీలు..ఆ పార్టీ నాయకులతో కలిసి పనిచేయడమేంటని నిలదీశారు. ఈ అంశంపై పార్టీ అంతర్గత సమావేశాల్లో చెప్పినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని ..దీనిపై కాంగ్రెస్‌ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని విహెచ్‌ స్పష్టం చేశారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/