పోలింగ్‌ కేంద్రం వద్ద కాంగ్రెస్‌, ఎంఐఎంల మధ్య ఘర్షణ

జోగులాంబ గద్వాలలో కాంగ్రెస్‌ నేతకు స్వల్ప గాయాలు

AIMIM and congress party
AIMIM and congress party

జోగులాంబ గద్వాల: తెలంగాణలోని పుర ఎన్నికల్లో రాజకీయ పార్టీలు సై అంటే సై అంటున్నాయి. ఎవ్వరూ ఎక్కడా తగ్గడం లేదు. ఒకరిపై ఒకరు పరస్పరం నిఘా వేస్తున్నారు. అనుమానం వస్తే అడ్డుకోవడం, వాగ్వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని గంజిపేట పోలింగ్ కేంద్రం వద్ద ఈరోజు ఉదయం ఎంఐఎం. కాంగ్రెస్ నేతలు ఘర్షణ పడ్డారు. ఈ ఘటనలో కాంగ్రెస్ కు చెందిన శంకర్ అనే వ్యక్తి గాయపడ్డారు. పోలింగ్ జరుగుతుండగా గంజిపేట పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చిన కాంగ్రెస్ నేత శంకర్ ఎంఐఎం ఓటర్లను ప్రలోభ పెడుతోందంటూ అక్కడి వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో ఎంఐఎం సభ్యులు ఎదురు తిరిగారు. ఇరువర్గాలు పరస్పరం తోపులాటకు దిగడంతో ఘర్షణ మొదలయ్యింది. ఈ ఘర్షణలో శంకర్ కాలికి గాయమయింది. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని లాఠీచార్జితో ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతం శంకర్ ను ఆసుపత్రికి తరలించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/