కంటోన్మెంట్‌ అధికారిణిపై హెచ్‌ఆర్‌సిలో ఫిర్యాదు

State Human Rights Commission
State Human Rights Commission

హైదరాబాద్‌: ఇంతకు ముందు ఓ ప్రభుత్వ అధికారిణి ఓ వ్యక్తిపై చెప్పుతో దాడి చేసిన ఘటన మనందరికీ తెలిసిందే. కాగా కంటోన్మెంట్ బోర్డ్ సర్వేయర్ అధికారిని సరిత వేధింపుల నుండి తనకు రక్షణ కల్పించాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో బాధితుడు రామ్ రెడ్డి పిర్యాదు చేశాడు. ఇంటి నిర్మాణ అనుమతి కోసం లంచం ఇవ్వాలని లేదంటే అడ్డుకుంటామని కంటోన్మెంట్ బోర్డ్ అధికారిని తనను వేదిస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. లంచం అడిగినందుకు నిలదీసినందుకు తనపై చెప్పుతో దాడి చేసిందని, తిరిగి తనపైనే మరేడ్ పల్లి పోలీసు స్టేషన్ లో అక్రమ కేసు పెట్టిందని.. ఆమె కేసు నమోదు చేసుకున్న పోలీసులు తాను సదరు అధికారినిపై పెట్టిన కేసును మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించాడు. కంటోన్మెంట్ అధికారుల నుండి రక్షణ కల్పించి, తనపై దాడి చేసిన అధికారినిపై చర్యలు తీసుకుని న్యాయం చేయండని బాధితుడు రామ్ రెడ్డి మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించాడు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/