11న కలెక్టర్లతో సిఎం కెసిఆర్‌ సదస్సు

కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్న కెసిఆర్

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ ఈనెల 11న జిల్లా కలెక్టర్లతో సమావేశం కానున్నారు. ప్రగతి భవన్‌లో ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశంలో అనేక కీలక అంశాలపై సుధీర్ఘంగా చర్చించ నున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం సోమవారం ఒక ప్రకటనను విడుదల చేసింది. రెండు రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఐఎఎస్ అధికారులను,జిల్లాకలెక్టర్ల బదిలీలు చేసిన నేపథ్యంలో ఈ సమావేశంపై ఆసక్తి నెలకొంది. విశ్వసనీయ వర్గాలు వెల్లడించిన సమాచారం మేరకు బదిలీల్లో కొత్తగా పలువురు ఐఎఎస్ అధికారులకు కలెక్టర్లుగా నియమించడంతో వారు నిర్వహించాల్సిన బాధ్యతలపై సిఎం చర్చించనున్నారు. సమావేశంలో రానున్న ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనలపై, సాధించాల్సిన లక్ష్యాలపై జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/