సైకో కిల్లర్‌ బాధిత కుటుంబసభ్యుల్ని కలిసిన కలెక్టర్‌

Collector Anitha Ramachandran
Collector Anitha Ramachandran

భువనగిరి: యాదాద్రి జిల్లా కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో సైకో కిల్లర్‌ బాధిత కుటుంబసభ్యుల్నిపరామర్శించారుహాజీపూర్‌, మైసిరెడ్డిపల్లిలో ఆమె పర్యటించారు. శ్రావణి, మనీషా, కల్పన కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. బాధిత కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటాం. బాధిత కుటుంబసభ్యులకు చేయూతనిస్తాం. హాజీపూర్‌మాచాన్‌పల్లి మధ్య వాగుపై వంతెన నిర్మాణాన్ని పరిశీలిస్తున్నాం. హాజీపూర్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. గ్రామానికి త్వరలోనే బస్సు సౌకర్యం కల్పిస్తామని కలెక్టర్‌ పేర్కొన్నారు.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/