అమరవీరుల స్తూపం వద్ద సిఎం కెసిఆర్‌ నివాళి

CM kcr tributes at gun park

హైదరాబాద్‌: నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిఎం కెసిఆర్‌ గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. రెండు నిమిషాలపాటు ఆయన మౌనం పాటించారు. హోంమంత్రి మహమూద్‌ అలీ, ఎంపీ సంతోష్‌ కుమార్‌, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అమరవీరులకు నివాళులు అర్పించారు. మరికాసేపట్లో ప్రగతిభవన్‌లో సిఎం కెసిఆర్ జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. కాగా నేటికి తెలంగాణ రాష్ట్రం ఆరు వసంతాలు పూర్తి చేసుకుని ఏడో వసంతంలోకి అడుగుపెట్టింది. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/