ముంబై బయలుదేరిన టిఎస్‌ సియం కేసిఆర్‌

KCR, TS CM
KCR, TS CM

హైదరాబాద్‌: తెలంగాణ సియం కేసిఆర్‌ మహారాష్ట్ర సియం దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఆహ్వానించేందుకు హైదరాబాద్‌ నుంచి ముంబైకి బయలుదేరారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి మహారాష్ట్ర సియంను, ఏపి సియంను ఆహ్వానించాలని నిర్ణయించుకున్నందున అందులో భాగంగానే కేసిఆర్‌ ముంబైకి బయలుదేరారు. అక్కడి నుంచి రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్‌ విద్యాసాగర్‌ రావుతో సమావేశం కానున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు మహారాష్ట్ర సియం అధికారిక నివాసమైన వర్షకు వెళ్తారు. ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరుకావాలని ఫడ్నవీస్‌ను సియం కేసిఆర్‌ స్వయంగా ఆహ్వానిస్తారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/