హుజూర్‌నగర్‌లో 17న సిఎం కెసిఆర్‌ సభ

సిఎం పర్యటన ఖరారు కావడంతో వేడెక్కిన రాజకీయాలు

cm kcr
cm kcr

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ హుజూర్‌నగర్ ఎన్నికలప్రచార కార్యక్రమం ఖరారైంది. ఈనెల 17న హుజూర్‌నగర్ లో నిర్వహించనున్న బహిరంగసభలో సిఎంకెసిఆర్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ భారీ బహిరంగం సభకు నియోజకవర్గంలోని ప్రతిమండలం నుంచి భారీగా జనం తరలివచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈబహిరంగసభలో ముఖ్యమంత్రి కెసిఆర్‌తో పాటు పలువురు మంత్రులు పాల్గొననున్నారు. కాగా హుజూర్‌నగర్ ఎన్నికలప్రచార భారీ బహిరంగసభకు ముఖ్యమంత్రికెసిఆర్ రానున్న నేపథ్యంలో ఒక్కసారిగా హుజూర్‌నగర్ రాజకీయాలు వేడెక్కాయి. టిఆర్‌ఎస్ నుంచి పోటీ చేస్తున్న సైదిరెడ్డి గెలుపుకోసం ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ ఉపఎన్నికల్లో టిఆర్‌ఎస్ భారీ మెజారిటీ సొంతం చేసుకుని కాంగ్రెస్,బిజెపిలకు గుణపాఠం నేర్పాలని టిర్‌ఎస్‌నాయకులు ఇంటింటికి ప్రచారం ప్రారంభించారు.

ఇప్పటికే మంత్రులు సత్యవతి రాథోడ్, జగదీష్ రెడ్డి, పార్టీ ప్రధానకార్యదర్శి ఎంఎల్‌సి పల్లారాజేశ్వర్ రెడ్డిలతోపాటు నల్గొండ జిల్లా టిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు ప్రచారంలో పాల్గొంటున్నారు. మంత్రి సత్యవతి రాథోడ్ ప్రధానంగా గిరిజన తండాల్లో ప్రచారాన్ని ఉధృతం చేశారు.ప్రజలను అనేకపర్యాయాలు మోసం చేసిన టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ నిజస్వరూపాన్ని ప్రజలు గమనించారని రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. ఉత్తమ్‌గెలిస్తే కేవలం ఆకుటుంబానికే లాభం టిఆర్‌ఎస్ గెలిస్తే నియోజకవర్గానికి లాభమనే విషయాన్ని ప్రజలు తెలుసుకోవడంతో గ్రామాలకు గ్రామాలు టిఆర్‌ఎస్ పార్టీలో స్వచ్ఛందంగా చేరుతూ టిఅర్‌ఎస్ అభ్యర్థి శానం పూడి సైదిరెడ్డికి మద్దతు ప్రకటిస్తున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి హుజూర్‌నగర్‌కు వస్తున్నారనే వార్త తెలియడంతో ప్రజల్లో సంతోషం వ్యక్తం మవుతుందన్నారు. సిఎం కెసిఆర్‌ను ఎప్పుడు చాడాలనే తపనతో ప్రజలు ఎదిరిచూస్తున్నారని చెప్పారు.
తాజా ఇ పేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/